in

భారత్ లో తయారీ సంస్థను ప్రారంభించనున్న టెస్లా!

భారత్ లో తయారీ సంస్థను ప్రారంభించనున్న టెస్లా!

ఎట్టకేలకు టెస్లా భారత్ కు రాబోతోంది. త్వరలోనే టెస్లా తయారీ ప్లాంటును ఇక్కడ ఇండియాలో ఏర్పాటు చేయనుంది.

అయితే గతంలో కూడా టెస్లా తయారీ సంస్థను ఇండియాలో ప్రారంభించడానికి చర్చలు జరిగగా.. 10 శాతం అదనపు చార్జీలు తగ్గించమని, దిగుమతిలో చార్జీలను కూడా తగ్గించమని ఎలోన్ మస్క్ కోరారు. కానీ కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇండియాలో సంస్థను ప్రారంభించాలంటే చైనా నుంచి దిగుమతి చేసుకోకూడదని, టాక్స్ లో తగ్గింపు కావాలంటే ముందుగా ఇండియాలో తయారు చేయడం మొదలు పెట్టాలని కొన్ని షరతులు పెట్టడడంతో ఇది మాటల మధ్యలోనే ఆగిపోయింది.
ఆ తరువాత కూడా ఈ విషయం ఎటూ తేలకపోవడంతో ఎలోన్ మస్క్ ఇండోనేసియాలో టెస్లాను ప్రారంభించాలని నిర్ణయించుకుని ఇండోనేసియా ప్రెసిడెంట్ జోకో విడోడోని కలిసి చర్చించారు. అలా ఇండియాలో టెస్లా స్థాపన పక్క దారి పట్టింది.

ఇప్పుడు మళ్లీ టెస్లా విషయం ముందుకు కదిలింది. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో టెస్లా అధినేత ఎలోన్ మస్క్‌తో భేటీ అయ్యారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత ప్రభుత్వంతో టెస్లా చర్చలు పున: ప్రారంభమయ్యాయి.

దీంతో భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్లాంట్ ఏర్పాటుకు టెస్లా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇక్కడ భారత్ లో తయారీ ప్లాంటును ఏర్పాటు చేసి ఇండో పసిఫిక్ ప్రాంతానికి ఎగుమతి చేయాలని టెస్లా భావిస్తోంది.

What do you think?

పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బొత్స

విడుదలైన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు