in

సీఎం జగన్ పై రామ్ గోపాల్ వర్మ సినిమా!

సీఎం జగన్ పై రామ్ గోపాల్ వర్మ సినిమా!

 

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నారు. ఆ సినిమాకి ‘వ్యూహం’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు.

ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో తేలే రామ్ గోపాల్ వర్మ ఈ సారి ఏకంగా ఓ మెట్టు ఎక్కి ఏపీ సీఎం జగన్ జీవితం పై ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని తెలుస్తుండగా.. జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? అలాగే 2015 నుంచి 2023 వరకు జగన్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్న విషయాలపై ఈ సినిమాను వర్మ చిత్రీకరిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు ‘వ్యూహం’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసిన వర్మ.. మొడటి బాగాన్ని ‘వ్యూహం1’, రెండొవ భాగాన్ని ‘వ్యూహం2’ అనే టైటిల్స్ తో తెరకెక్కిస్తున్నారు. ‘ వ్యూహం1’ ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో, ‘వ్యూహం2’ ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ఆర్జీవీ భావిస్తున్నారట.

ఈ సినిమాతో ఆర్జీవీ ఇంకెన్ని వివాదాలలో కనిపిస్తారో చూడాలి మరి.

What do you think?

సైబర్‌ నేరగాళ్లకు కోటిన్నర సమర్పించుకున్న ఓ యువతి

గాలి జనార్ధన్ కు షాక్ ఇచ్చిన సీబీఐ స్పెషల్ కోర్ట్