ఆర్బీఐ సంచలన ప్రకటన. ఇక రూ.2 వేల నోట్లు చెల్లవు!
RBI: రిజర్వ్ బ్యాంక్ సంచలన ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్లు చెల్లవని, వాటిని ఉపసంహరించుకుంటున్నామని తెలిపింది.
2016లో డీమానిటిజేషన్ సమయంలో ఇండియా అంతా అల్లకల్లోలం అయ్యింది. ఇప్పుడు తాజా ఆర్బీఐ ప్రకటనతో అదే పరిస్తితి మళ్ళీ వచ్చేలా కనిపిస్తుంది.
తాజాగా రిజర్వ్ బ్యాంక్ సంచలన ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నామని తెలిపింది. సెప్టెంబర్ 30లోగా ఆ నోట్లను బ్యాంక్ డిపాజిట్ చేసుకోవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. మే 23 నుంచి ఆర్బీఐ రీజనల్ ఆఫీసుల్లో 2 వేల నోట్లను మార్చుకోవచ్చని చెప్పింది.
బ్యాంక్లకు కూడా రూ.2 వేల నోట్లను సర్కూలేషన్లో ఉంచ్చొదని ఆదేశం ఇచ్చింది. దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్ల మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్టుగా ఆర్బీఐ తెలిపింది. అయితే ఒక విడతలో రూ.20 వేలు మాత్రమే మార్చుకోగలరంటూ పేర్కొంది.
ఇక 2018-19 ఆర్ధిక సంవత్సరంలోనే రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేసినట్టు స్పష్టం చేసిన ఆర్బీఐ.. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది.