in

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం! 12 మంది మృతి.

మహారాష్ట్రలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు మృతి చెందగా.. 27 మంది ప్రయాణికులు గాయాలపాలైయారు.

వివరాల్లోకి వెళ్తే ముంబయిలోని గొరెగావ్ కు చెందిన ఓ సంగీత బృందం పుణెకు దగ్గర్లోని పింప్రి చింఛ్వాడ్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే కార్యక్రమం అనంతరం వీరు పుణె నుంచి ముంబయికు ఓ ప్రైవేటు బస్సులో తిరిగి వెళ్తుండగా.. తెల్లవారుజామున 4.50 గంటల సమయంలో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఖపోలీ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు మరణించగా.. 27 మందికి గాయాలయ్యాయని రాయగఢ్ ఎస్పీ తెలిపారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్చారని, ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.

What do you think?

ఈమె మొసలితో పోరాడి భర్త ప్రాణాలు కాపాడుకుంది!

“శాకుంతలం” ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..