ఓ అధికారి ఇంట్లో దొంగతనం చేసిన ఎస్ఐ.
ఓ ఎస్ఐ ముషీరాబాద్ ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో దొంగతనం చేశాడు. ఆ ఎస్ఐని పొలీసులు ప్రస్తుతం రహస్యంగా విచారిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్‌లోని ముషీరాబాద్ కు చెందిన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ ప్రసాద్ కు రూ.100 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఈ విషయాన్ని దుండిగల్ ఎస్ఐ కృష్ణ తెలుసుకున్నాడు. తరువాత ఎవరికీ అనుమానం రాకుండా సురేందర్ అనే పాత నేరస్తుడితో ఆ ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ ప్రసాద్ ఇంట్లో దొంగతనం చేపించాడు. అలా శామ్యూల్ ఆస్తులకు చెందిన 40 విలువైన డాక్యుమెంట్లను ఎస్ఐ కృష్ణ పొందాడు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఎస్ఐ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని రహస్యంగా విచారిస్తున్నారు.