గ్యాంగ్‌స్టర్ భూముల్లో పేదలకు ఇళ్లు!
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఓ గ్యాంగ్‌స్టర్ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వాలని నిర్ణయించారు.
వివరాల్లోకి వెళ్తే అతీక్ అహ్మద్ అనే ఓ గ్యాంగ్‌స్టర్ ఇటీవలే ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. అయితే ఈ గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కు చెందిన భూములలో పేదలకు ఇళ్లు కట్టించాలని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించి లాటరీకి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ లాటరీకి 6,030 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,590 మందిని అర్హులుగా యూపీ సర్కార్ తేల్చింది. ఇప్పటికే అతీక్ స్థలంలో 76 ప్లాట్లు నిర్మిస్తుండగా.. వీటి నిర్మాణం పూర్తయ్యాక లాటరీలో గెలుపొందిన వారికి యోగి ఆదిత్యనాథ్ ఇళ్ల పట్టాలను అందించనున్నారు.
ఇదే విధంగా మాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న భూముల్లో కూడా పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వాలని యూపీ సర్కార్ కసరత్తు చేస్తోంది.