in

అనకాపల్లి జిల్లాలోని ఫార్మాకంపెనీలో అగ్ని ప్రమాదం.

అనకాపల్లి జిల్లాలోని ఫార్మాకంపెనీలో ప్రమాదం.

 

అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. సాహితీ ఫార్మాకంపెనీలోని రియాక్టర్ పేలడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాకు చెందిన అచ్యుతాపురం సెజ్‌లోని సాహితీ ఫార్మాకంపెనీలో ఒక్కసారిగా రెండు రియాక్టర్లు పేలిపోయాయి. దీంతో పెద్ద ఎత్తున్న ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ పేలుడు భారీ శబ్దంతో సంభవించడంతో కార్మికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ప్రమాదం జరిగేటప్పుడు మొత్తం 35 మంది కార్మికులు విధుల్లో ఉన్నారని.. వారిలో 28 మంది వెంటనే బయటకు వచ్చేసారని ఎస్పీ తెలిపారు.

కాగా మిగిలిన ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్తితి విషమంగా ఉండగా.. మిగిలిన ముగ్గురికి గాయాలయ్యి విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వీరిని మంత్రి అమర్నాథ్ పరామర్శించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి అండగా ఉంటామని.. వారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని తెలిపారు.

What do you think?

ఓ అధికారి ఇంట్లో దొంగతనం చేసిన ఎస్ఐ.

అరుదైన ఘనత సాధించిన రాజమౌళి. ఐఎస్బీసీ చైర్మన్ గా..