in

ఇంజినీర్ నుంచి 19 లక్షలు దండుకున్న సైబెర్ గాళ్ళు.

ఇంజినీర్ నుంచి 19 లక్షలు దండుకున్న సైబెర్ గాళ్ళు.

 

సైబర్ నేర గాళ్లు ఓ ఇంజినీర్ నే బోల్తా కొట్టించారు. ఆ ఇంజినీర్ నుండి ఏకంగా 19 లక్షలు ఊడ గొట్టారు.

 

వివరాల్లోకి వెళ్తే విజయవాడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఓ యువతి ఫోన్ కి “ఖాళీ సమయాల్లో పార్ట్ టైం జాబ్.. తక్కువ పని, ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు” అంటూ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ ను చూసి జాబ్ తో పాటు, పార్ట్ టైం జాబ్ చేసి ఇంకా డబ్బు సంపాదించవచ్చని భావించిన ఆ యువతి ఆ మెసేజ్ పంపిన కేటు గాళ్లని సంప్రదించింది. వాళ్లు లైక్ చేయమన్న విడియోలకు లైకులు కొట్టి 150 రూపాయలు సంపాదించింది. ఆ తరువాత కూడా ఇలాగే చేసి 300 రూపాయలు సంపాదించింది. ఇలా వాళ్ళు చెప్పినట్టుగా డబ్బు వస్తుండడంతో ఆమె పూర్తిగా ఆ కేటు గాళ్ల బుట్టలో పడిపోయింది. ఈ సమయంలోనే మరింత డబ్బును సంపాదించొచ్చని ఆమెకు ఆశ చూపించారు.

అయితే ఈ సారి డబ్బు రావాలంటే ఓ 1000 రూపాయలు వెచ్చించాలని, అలా వెచ్చిస్తే డబ్బు రెట్టింపు అవుతుందని మాయ మాటలు చెప్పారు. ఈ మాటలను నమ్మిన ఆ యువతి అలాగే వెచ్చించగా.. ఆ డబ్బులు రెట్టింపు అయ్యి 16 వందలు ఆమె అకౌంట్లోకి వచ్చి చేరాయి. దీంతో వాళ్ళని పూర్తిగా నమ్మిన యువతి వాళ్ళు చెప్పినట్టు ఇన్వెష్ట్ చేస్తూ వచ్చింది.

అయితే ఈ సారి ఆమె డబ్బు రెట్టింపు అయ్యి రాక పోగా తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం తరిగి పోయింది. అలా ఆ యువతి కేటుగాళ్లకి 19 లక్షలు పోగొట్టుకుంది. వాళ్ళని అడిగినా డబ్బు తిరిగి రాకపోవడంతో చివరికి వాళ్ళు మోసగాళ్లని తెలుసుకుని తల పట్టుకుంది. అనంతరం దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేసింది.

What do you think?

మే 25న తెలంగాణ ఎంసెట్ ఫలితాల విడుదల.

వరుడు ని వెంటాడి మరీ పెళ్లి చేసుకున్న వధువు!