జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ ని అందుకోనున్న అదానీ
గౌతమ్ అదానీ! ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు.ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన అదానీ యొక్క నెట్ వర్త్ ‘వారెన్ బఫెట్’ మరియు ‘బిల్ గేట్స్’ లను అధిగమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతను ‘జెఫ్ బెజోస్’మరియు ‘ఎలాన్ మస్క్’ లకు మాత్రమే పోటీగా ఉన్న సంపద స్థాయికి వేగంగా చేరుకుంటున్నాడు.
చదువు ఆపేసి కాలేజ్ ని మధ్యలో వదిలేసిన అదానీ బొగ్గు మరియు ఓడరేవుల వైపు మళ్లడానికి ముందు 1980ల ప్రారంభంలో ముంబైలోని వజ్రాల పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అతను విమానాశ్రయాల నుండి డేటా సెంటర్లు, మీడియా మరియు సిమెంట్ వరకు అన్నింటిలోనూ విస్తరించి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు. గత సంవత్సరం, గ్రీన్ ఎనర్జీలో $70 బిలియన్ల పెట్టుబడి పెట్టడానికి పూనుకున్న అతను ఆ పెట్టుబడితో ప్రపంచంలోని అతిపెద్ద పునరుత్పాదక-శక్తి(రేనేవబుల్ ఎనర్జీ) ఉత్పత్తిదారుడుగా మారాడు.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అనేక సంపదలు కుప్పకూలిన సంవత్సరంలో, అతని నెట్ వర్త్ దాదాపు రెట్టింపు అయింది, $64.8 బిలియన్ల నుండి $141.4 బిలియన్లకు పెరిగి అతనిని ఈ భూ గ్రహం మీద మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా చేసింది.హ్యాట్స్ ఆఫ్ అదానీ 👏👏