in

డ్రెస్ కోడ్ లేకపోతే… దేవుడి దర్శనం కూడా లేదా?

హిందువులు జరుపుకునే పెద్ద పండుగలలో శివ రాత్రి కూడా ఒకటి.ఈ ఏడాది శివరాత్రి ఫిబ్రవరి 18న వస్తుంది.ఆ రోజు ఆలయానికి వెళ్ళి.. దేవుడి దర్శనం, ఉపవాసం చేసి.. రాత్రంతా జాగారం చేస్తే.. మంచి జరుగుతుందని,కోరిన కోరికలు తీరతాయని నమ్ముతారు.
ఈ శివ రాత్రి రోజున శివాలయాల్లో భక్తులు కిటకిటలాడుతారు.అందులోనూ మధ్య ప్రదేశ్ లోని రేవాలో ఉండే దేవతలాబ్ శివాలయం అయితే ఇసకేస్తే రాలనంత జనం తండోపతండాలుగా ఆ శివయ్యను దర్శించుకోడానికి వస్తుంటారు.దేవతలాబ్ శివాలయాన్ని ఉజ్జయినిలో ఉన్న మహాకాల్ తరహాలో ఆకర్షణీయంగా అలంకరిస్తారు.అయితే మన తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లోకి వెళ్ళాలంటే ఎలాంటి డ్రెస్ కోడ్ నిబంధన లేదు కానీ రేవాలోని ఈ దేవతలాబ్ ఆలయంలో మాత్రం ఒక డ్రెస్ కోడ్ ఉంది.మన తెలుగు రాష్ట్రాలలో సంప్రదాయానికి మారు పేరు అయిన పంచ నుంచి మోడ్రన్ బ్రాండ్ జీన్స్ మనకు నచ్చిన బట్టలు వేసుకుని దేవుడిని దర్శించుకోవచ్చు.రేవాలోని దేవతలాబ్ ఆలయంలోకి వెళ్ళాలంటే మాత్రం మగవారికి సంప్రదాయ కట్టు,ఆడ వారికి చీర కట్టు తప్పని సరి.
ఎందుకంటే దేవతలాబ్ శివాలయంలోకి జీన్స్, టీ-షర్టు, షార్ట్ స్కర్ట్ వంటి మోడ్రన్ దుస్తులు వేసుకున్న భక్తులను లోపలికి అనుమతించరు.సంప్రదాయ దుస్తులను ధరించిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు.మహిళలను కూడా చీరలు కట్టుకుంటే లోపలికి రాణిస్తారు.మోడ్రన్ డ్రెస్ లు వేస్తే అటు నుంచి అటు ఇంటికి పంపేస్తారు.అలా వారు పెట్టిన నిబందనలు పాటిస్తేనే శివయ్య దర్శించుకునే అవకాశం కల్పిస్తారు.
శివాలయంలోనికి ప్రవేశించడానికి విధించిన ఈ నిబంధనలపై ఇటీ వల మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ రేవా దేవతలాబ్ ఆలయ నిర్వహణ నిబంధనలను చర్చించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేశారు.ఆలయంలోకి రావాలంటే డ్రెస్ కోడ్ పాటించాలని,సంప్రదాయ వస్త్రాలతోనే రావాలని ఆయన స్పష్టం చేశారు.SDOP సూచనలను అనుసరించడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.మహాశివరాత్రి లోపు ఆలయ నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టటం చేశారు.అదే విధంగా మహాశివరాత్రి పండుగ సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ పురాతన ఆలయాన్ని సందర్శిస్తారని,అందువల్ల శివరాత్రి రోజు ఆలయాన్ని రంగురంగుల పుష్ఫాలు, విద్యుత్ దీపాలతో అలంకరించాలని చెప్పారు.
అయితే ఈ డ్రెస్ కోడ్ నిబంధనల పై మాత్రం భక్తుల నుంచి బిన్నభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

What do you think?

155 Points
Upvote Downvote

ఉక్రెయిన్ తో యుద్దం వల్ల రష్యా నష్టపోతుందా?పుతిన్ మాటలు బడాయి కబుర్లేనా?

యాపిల్ల ను అమ్మి దనవంతులైన గ్రామస్తులు, అదేలా గంటే…