విడుదలైన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి.
ఈ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు 5035 మంది హాజరవ్వగా.. వారిలో మొత్తం 259 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. వీరిలో ఏకంగా 39 మంది స్పోర్ట్స్ కోటా నుంచి సెలెక్ట్ అవ్వడం విశేషం. కాగా రాష్ట్రంలో 111 గ్రూప్ 1 పోస్టులకు గానూ వీరిని స్క్రూటినీ చేయనుండగా.. ఎంపికైన అభ్యర్థులకు ఆగష్టు 2వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇక సెప్టెంబర్ నాటికి ఇంటర్వ్యూలు ముగించి నియామకాలు పూర్తి చేయనున్నారు.