in

అంబటి రాయుడి ఆస్తి పాస్తులు ఎంతో తెలుసా..?

అంబటి రాయుడి ఆస్తి పాస్తులు ఎంతో తెలుసా..? 

స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు ఆస్తి విలువెంతో మీకు తెలుసా..? తెలిస్తే అమ్మో అంత ఆస్తి ఉందా అనుకుంటారు. మరి క్రికెటర్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి.

ఇటీవల అంబటి రాయుడు ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే అతని ఆస్తి ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇక ఏముంది ఎక్కడ చూసినా అతని పేరు, అతని ఆస్తి వివరాలే వినిపిస్తున్నాయి.

ఆ విషయాల్లోకి వెళ్తే అంబటి రాయుడి మొత్తం నికర ఆస్తి విలువ దాదాపు రూ. 50 కోట్లు ఉంటుందట. లగ్జరీ కార్ల విలువ 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు, అలాగే బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్ల ద్వారా రూ. కోటి దాకా ఆర్జిస్తాడట. ఇక ఐపీఎల్ ద్వారా ఏడాదికి రూ.6.25 కోట్లు సంపాదిస్తాడట. రాయుడికి హైదరాబాద్లో రిసార్టులు, ఫార్మింగ్ బిజినెస్‌లు ఉన్నాయట. వీటితో పాటు దేశవ్యాప్తంగా అనేక రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టాడు. అతనికి గుంటూరులో ఓ లగ్జరీ డిజైనర్ ఇల్లు కూడా ఉందట.

వింటుంటే అంత ఆస్తా..? అనిపిస్తుందా..?! టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ అంటే ఆమాత్రం ఆస్తి పాస్తులు ఉంటాయిగా మరి.

What do you think?

డబ్ల్యూటీసీకి సిద్దమౌతున్న టీమ్ ఇండియా..!

భారత్ అక్కడ ఆడ బోవడం లేదు.పాక్ లేకుండానే మ్యాచలు..