‘ఆదిపురుష్’ హిందువులపై విదేశీ కుట్ర
ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన “ఆదిపురుష్” వివాదం గడ్డివాముకు అంటుకున్న నిప్పురవ్వలా రోజు రోజుకు పెరుగుతోంది. అప్పుడు టీజర్ విడుదలైనప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ ఇబ్బందిగా అనిపించగా.. ఇప్పుడు సినిమా విడుదలైన తరువాత “అదిపురుష్” సినిమానే ఇబ్బందిగా మారింది. సినిమాలోని మాటలు, పాత్రలను చూపించిన విధానం దుమారం రేపుతూ సంచలనంగా మారింది.
ఇప్పటికే ఈ “ఆదిపురుష్” సినిమాను ఉత్తర్ ప్రదేశ్ లోని పలు చోట్ల బ్యాన్ చేయాలని నిరసన చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం పై అయోధ్య ప్రాధన అర్చకులు సత్యేంద్ర దాస్ కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమా మన హిందూ ఇతిహాసాలని అపహాస్యం చేసేలా ఉందని.. సినిమాలోని మాటలు ఆమోదయోగ్యం లేవని అన్నారు. రామాయణంలోని పాత్రలు ఇందులలోని రాముడు, సీత, రావణుడు, లక్ష్మణుడు, హనుమంతుల పాత్రలు చాలా దూరంగా ఉన్నాయని.. బాలీవుడ్ వారికి మన ఇతిహాసాలు, సంస్కృతి పట్ల గౌరవం లేదని మండి పడ్డారు. “ఆదిపురుష్” ను హిందులపై విదేశీ కుట్రలో భాగంగా మేకర్స్ తెరకెక్కించారని సత్యేంద్ర దాస్ ఆరోపించారు.
ఇదిలా ఉండగా మరోవైపు ఈ వివాదాలు సినిమా కలెక్షన్స్ పై బాగా ప్రభావం చూపుతున్నాయి. మొదటి రోజు రూ.80 కోట్లతో భారీ ఓపెనింగ్స్ పొందిన ఆదిపురుష్ ఐదోవ రోజుకు రూ. 4.75 కోట్ల – 5 కోట్లకు దిగజారి పోయింది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కష్టమేనని సినీ ప్రముఖులు భావిస్తున్నారు.