కొన్ని సంవత్సరాల క్రితం మనుగడలోకి వచ్చిన పది రూపాయల కాయిన్లు తరువాత జరిగిన దుష్ప్రచారాల వల్ల,అపోహలు వల్ల కనుమరుగై పోయాయన్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఇప్పుడు 2000,500 సహా ఉన్న అన్ని రూపాయల నోట్లపై పెన్నితో కానీ లేదా పెన్సిల్ తో కానీ రాస్తే అవి చెల్లవంటూ మరో దుష్ప్రచారమే ప్రజల మధ్య జరుగుతుంది.
వివరాల్లోకి వెళ్తే 2000,500,200,100 రూపాయల నోట్లపై పెన్నుతో కాని,పెన్సిల్ తో కాని రాస్తే అవి ఇక చెళ్లవని ప్రజలలో ఇటీవల వైరల్ ప్రచారం మొదలైంది.అయితే మునుపటి సంఘటనే మళ్ళీ పునరావృతం కాకూడదని భావించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పాక్ట్ చెక్ చేసి ఈ దుష్ప్రచారంపై ప్రజలకు స్పష్టతనిచ్చింది.సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని చెబుతూ ఈ పుకారును కొట్టేసింది.
2000,500 సహా ఉన్న అన్ని రూపాయల నోట్లలో ఏ నోటపైన అయినా పేన్నుతో,పెన్సిల్ తో,సిరాతో రాసినా సరే అవి చెల్లుతాయని,దీనిపై ఎటువంటి సందేహం వద్దని పిబిఐ చెక్ చేసి వెల్లడించింది.ఈ విషయాన్నే తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది.అయితే ఇలా పేన్నుతో,పెన్సిల్ తో,సిరాతో నోట్లపై రాస్తే అవి చెల్లడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు కానీ వాటి మన్నిక తగ్గే అవకాశం ఉందని తెలిపింది.వీలైనంత వరకు వాటిపై ఏమి రాయవద్దని సూచించింది.ఈ విషయంపై పూర్తి మార్గ దర్శకాలను అర్బిఐ 2020లోనే జారీ చేసిందని వివరించింది.
అయితే ప్రతి సారి ప్రతి దాని మీద దుష్ప్రచారం పుట్టిస్తే తరువాత దేనిని నమ్మాలో దేనిని నమ్మకూడదో ప్రజలకు స్పష్టత ఉండదు.కాబట్టి ఇలాంటి వాటిపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని కుదిరినంత వరకు అడ్డుకునే ప్రయత్నం చేస్తే బావుంటుందని ప్రజలు భావిస్తున్నారు.
10 రూపాయల కాయిన్ లాగానే 2000, 500 నోట్లు కనుమరుగైపోతాయా? 2000 ,500 నోట్లు ఇక చెల్లవా?
